జాబ్‌ చేంజ్‌ అంటే ఇదీ.. ఏకంగా రూ.45 లక్షల జీతానికి.. | One Job Switch 700pc Hike Delhi Techie Lands Rs 45 Lakh Package In One Move, More Details Inside | Sakshi
Sakshi News home page

జాబ్‌ చేంజ్‌ అంటే ఇదీ.. రూ.5.5 లక్షల నుంచి రూ.45 లక్షల జీతానికి..

May 28 2025 9:41 PM | Updated on May 29 2025 1:56 PM

One Job Switch 700pc Hike Delhi Techie Lands Rs 45 Lakh Package In One Move

తరచూ ఉద్యోగాలు మారడం కార్పొరేట్ సంస్కృతిలో భాగంగా మారింది. ఎందుకంటే జాబ్‌ మారిన ప్రతీసారి జీతాలు, హోదాలు, ఇతర ప్రయోజనాలు పెరుగుతాయి. సాధారణంగా ఉద్యోగాలు మారడం ద్వారా సగటున 30–40 శాతం లేదా కొన్ని సందర్భాల్లో 100 శాతానికి పైగానే ఉద్యోగులు జీతాలను పెంచుకుంటున్నారు. కానీ ఒక్క స్విచ్‌లో ఏకంగా 700 శాతానికి పైగా జీతం పెరిగిందంటే నమ్ముతారా?

మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఓ టెక్కీ విషయంలో ఇలాగే  జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జాబ్ స్విచ్ స్టోరీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఒక ప్రముఖ టెక్ కంపెనీలో తన వార్షిక వేతనం రూ.5.5 లక్షల నుంచి కేవలం ఏడాదిలోనే రూ.45 లక్షలకు పెరిగిందని ఆ యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇటీవల తన కెరీర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో అతని పోస్ట్ త్వరగా దృష్టిని ఆకర్షించింది. విస్తృతమైన చర్చను రేకెత్తించింది.

దేవేష్ అనే డెవలపర్ ఏడాది క్రితమే ఫుల్ టైమ్ కెరీర్ ప్రారంభించారు. మామూలు వేతనంతో ప్రారంభమైన ఆయన ఇప్పుడు తన ప్రారంభ వేతనానికి దాదాపు తొమ్మిది రెట్లు సంపాదిస్తూ ఒక అగ్రశ్రేణి గ్లోబల్ టెక్ కంపెనీలో స్థానం సంపాదించినట్లు పేర్కొన్నారు.  అదే సమయంలో ఇప్పుడిప్పుడే కెరీర్‌లో అడుగుపెడుతున్నవారికి కొన్ని సూచనలూ ఇచ్చారు. అధిక ప్రారంభ వేతనాల కంటే నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆ తర్వాత భారీ వేతనాలను సాధించవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement