అల్లూరి సీతారామరాజు జిల్లా: పల్లె పాలనపై ఆసక్తితో పలువురు విద్యావంతులు పంచాయతీ ఎన్నికల బరిలో దిగి, ఓటర్ల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండలంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల పదవులకు సైతం వైద్యులు, ఇంజినీర్లు, ఉన్నత విద్యావంతులు పోటీ పడుతుండటం విశేషంగా మారింది.
సర్పంచ్ బరిలో..
తాళ్లపాలెం మేజర్ పంచాయతీ నుంచి డాక్టర్ సయ్యపురెడ్డి సునీత, బీఏ చదివిన లక్కరాజు అభివర్షిణి పోటీ చేస్తున్నారు. ఎ.ఎస్. పేట నుంచి బీటెక్ పూర్తిచేసిన మలసాల వెంకటలక్ష్మి ప్రమోదిని బరిలో నిలిచారు. నూతలగుంటపాలెం నుంచి ఎంబీఏ చదివిన కలిగట్ల సింహాద్రిరావు, తేలపాల శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. జెట్టపురెడ్డితుని నుంచి ఎంసీఏ చేసిన కోన సోమినాయుడు, బీటెక్ చేసిన వెంకట శ్రీకర్ పోటీలో ఉన్నారు. సోమవరం నుంచి బీఎస్సీ చదివిన గౌట్ నాగ అప్పలనాయుడు, తేగాడ నుంచి డిగ్రీ చదివిన సిదిరెడ్డి సూర్యనారాయణ సర్పంచ్ అభ్యర్థులుగా నిలిచారు. వీరితో పాటు ఇంటరీ్మడియెట్, టెన్త్, 5వ తరగతి చదివిన అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మరోవైపు కొత్తపల్లి, బుచ్చియ్యపేట, అడ్డాం తదితర మారుమూల గ్రామాల నుంచి కొందరు నిరక్షరాస్యులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.
వార్డు సభ్యుల పదవులకూ..
చిన్న గ్రామాల్లోని వార్డు సభ్యుల పదవులకు సైతం ఉన్నత విద్యావంతులు పోటీ చేస్తున్నారు. జెట్టపురెడ్డితునిలో దంత వైద్యురాలు పొన్నగంటి తేజస్విని బరిలో నిలిచారు. సోమవరంలో బీఫార్మసీ చేసిన గొంతిన తులసి, డిగ్రీ చదివిన నిమ్మదల చిరంజీవి పోటీ చేస్తున్నారు. ఈ. చౌడువాడలో ఎంబీఏ చేసిన సిరపారపు శివరామకృష్ణ, బీటెక్ చేసిన కూండ్రపు ప్రదీప్, డిగ్రీ చదివిన సింగంపల్లి స్వాతి పోటీలో ఉన్నారు. తాళ్లపాలెంలో ఎంఏ చేసిన గాడి శైలజ, బీఈడీ చేసిన కోన చంద్రకళ, డిగ్రీ చదివిన తోరం వెంకట గణేష్ బరిలో నిలిచారు.
ఎ.ఎస్. పేటలో మలసాల నాగలక్ష్మి, సేనాపతి నాగేంద్రబాబు, కామాకుల శ్రీను పోటీ చేస్తున్నారు. చింతలపాలెంలో మజ్జి కుమారి, డిగ్రీ చదివిన ఒమ్మిరెడ్డి వెంకట నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. నూతలగుంటపాలెంలో బీఈడీ చదివిన పిల్లి భవాని, చంద్ర గోపీకృష్ణ బరిలో ఉన్నారు. గొబ్బూరులో డిగ్రీ చదివిన బొల్లి ప్రతాప్ సాయి, చెరకాంలో రొంగలి సత్యవతి పోటీ చేస్తున్నారు. తేగాడలో ఎంబీఏ చేసిన దుడ్డి దత్తాత్రేయ, సర్వసిద్ధి శాంతి, నగిరెడ్డి పద్మ బరిలో నిలిచారు. జి. భీమవరంలో బీటెక్ చేసిన ఉరిగిటి హరిప్రసాద్, సుందరయ్యపేటలో బండారు అరుణ కుమార్, పోటీ చేస్తున్నారు. వీరితో పాటు పలుచోట్ల నిరక్షరాస్యులు కూడా వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్నారు.
సర్పంచ్ బరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
దేవరాపల్లి: మండలంలోని వేచలం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గ్రీష్మనాయుడు రెడ్డి సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగారు. గ్రామంలో నిత్యం ప్రజలకు అందుబాటులో కొన్నేళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న తన తండ్రి రెడ్డి వెంకట కృష్ణనాయుడు (ఆర్కే నాయుడు) బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. వేచలం సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పంచాయతీ ఎన్నికల్లో 25 ఏళ్ల యువతి పోటీ చేస్తుండటంతో గ్రామంలోని అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు.
వేచలం నుంచి కొత్తపెంటలోని నామినేషన్ కేంద్రం వరకు ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో యువతి తండ్రి ఆర్కే నాయుడు పంచాయతీ 8వ వార్డు మెంబర్‌గా పోటీలో ఉన్నారు. గ్రీష్మనాయుడు మాట్లాడుతూ తన తండ్రి సేవా స్ఫూర్తితో ప్రజల సహకారంతో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శంగా అభివృద్ధి చేస్తానన్నారు. పక్షపాతం లేకుండా పారదర్శకంగా పాలన సాగిస్తానని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న సర్పంచ్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: మీరు జనసేన ఎమ్మెల్యేనా.. స్వతంత్ర అభ్యర్థి ప్రచారకర్తనా?


