నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం | software engineer ends life in road incident | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

Jul 14 2025 12:13 PM | Updated on Jul 14 2025 12:13 PM

software engineer ends life in road incident

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి 

నంద్యాల: మరో నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చుంచుఎర్రగుడి గ్రామానికి చెందిన శిరోల్ల రవితేజ(29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే ఇతనికి కల్లూరు మండలం చిన్నటేకూరులో ఓ అమ్మాయితో వివాహ నిశ్చయం జరిగింది. 

మరో నెల రోజుల్లో పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఆదివారం రవితేజ తన బంధువు అయిన మరో వ్యక్తితో బెంగళూరులో బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా కారు వచ్చి ఢీకోట్టింది. దీంతో తలకు హెల్మెట్‌ ఉన్న రవితేజతోపాటు మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీరని శోకంతో బెంగళూరుకు వెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement