HYD: జూ పార్క్‌ టికెట్‌ రేట్లు పెరిగాయ్‌.. | Hyderabad Nehru Zoo Entry Fee Hiked From August 1, Check New Ticket Prices Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: జూ పార్క్‌ టికెట్‌ రేట్లు పెరిగాయ్‌..

Aug 1 2026 9:16 AM | Updated on Aug 1 2026 4:19 PM

Nehru Zoological Park Hikes Entry

హైదరాబాద్‌: నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో ప్రవేశ రుసుమును శనివారం నుంచి పెంచుతునట్టు జూపార్క్‌ క్యురేటర్‌ జె.వసంత శుక్రవారం తెలిపారు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ.60 గా నిర్ణయించామన్నారు. గతంలో పెద్దలకు రూ.100 చిన్నారులకు 50గా ఉండేది. విదేశీయులలో పెద్దలకు రూ.1000 చిన్నారులకు రూ.500గా ఉంటుంది. 

సఫారీ చార్జి ఏసీ బస్సులలో ఒక్కరికి రూ.165, ఈ సఫారీ బస్సులలో ఒక్కరికి రూ.110, కాలుష్య రహిత బ్యాటరీ వాహనం రైడ్‌ పెద్దలకు రూ.135, చిన్నారులకు 75, చిట్టి రైలు పెద్దలకు రూ.90 చిన్నారులకు రూ.45, కాలుష్య రహిత బ్యాటరీ 11 సీట్ల వాహనం రూ.3300, 14 సీట్ల వాహనం రూ.4400 రూపాయలుగా రుసుము తీసుకోనున్నారు. 

చేపల అక్వేరియంకు ఒకరికి రూ.25, నిశాచర జంతుశాలలో పెద్దలకు రూ.25, చిన్నారులకు రూ.15, సరిసృపాల జగత్తు పెద్దలకు రూ.35, చిన్నారులకు రూ.15, కెమెరాలకు 500 రూపాయలు, కెమెరా విత్‌ లెన్స్‌ సెటప్‌కు 700 రూపాయలు తీసుకోనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement