పెరుగుతున్న విద్యార్థులఆత్మహత్యలు
పాఠశాలల్లోకొరవడి నమానసిక ఆరోగ్యం
ఐసీ3 స్టూడెంట్ సూసైడ్ రిపోర్ట్‌లో వెల్లడి
చదువు అంటే నేర్చుకోవడం..అది కూడా ఆసక్తితో.. కానీ కొన్నేళ్లుగా చదువు అర్థం మారిపోయింది. పోటీపడాలి.. అత్యధిక మార్కులు సాధించాలి. అంతేకాదు ఉత్తమ కళాశాలలో సీటు సంపాదించాలి. ఈ ఒత్తిడి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చదువు అంటేనే చాలామంది భారంగా భావించే స్థాయికి వచ్చారు. ఫలితాలు వారి అంచనాలను అందుకోలేనప్పుడు ఎవరూ ఊహించని ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒకటి భారత్‌లో జరుగుతోంది. 2024 ఐసీ3 స్టూడెంట్ సూసైడ్ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా చదువుల ఒత్తిడి తీవ్రంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. 2013–2022 మధ్య మన దేశంలో లక్షకు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ కాలంతో పోలిస్తే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్న విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో 64 శాతం పెరిగింది. ‘పరీక్షలు, మార్కులకు మాత్రమే ఈ సంక్షోభాన్ని ముడిపెట్టకూడదు. విద్యార్థుల్లో భయం,నిశ్శబ్దం అలుముకుంది. వారికి భరోసా లేకపోవడం సమస్యను పెంచుతోంది’అని నివేదిక తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
నమ్మకానికి బదులుగా నిశ్శబ్దం..
చదువులు, తల్లిదండ్రుల నుంచి భారీ అంచనాలు, సామాజి కంగా ఇతరులతో పోలిక వంటి ఒత్తిడిని నేటి విద్యార్థులు ఎదు ర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా విద్యార్థులు పడుతున్న బాధ ను ఎవరూ ముందుగా గుర్తించడం లేదని నివేదిక వివరించింది. మార్గనిర్దేశనానికి బదులుగా చాలామంది తరగతి గదుల్లో భయంతో కూడిన ప్రేరణను అనుభవిస్తున్నారు. నమ్మకానికి బదులుగా నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటున్నారు. విద్యలో ప్రధాన భాగంగా కాకుండా కౌన్సెలింగ్‌ను ఇప్పటికీ చివరి ప్రయత్నంగా చూస్తున్నారు’అని తెలిపింది.
పరిష్కారం
వారి చేతుల్లోనే..నేర్చుకోవడం, విద్యార్థుల శ్రేయస్సు విషయంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంస్కృతిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ‘విద్యార్థులు చదువును ద్వేషించరు. పెద్దల నుంచి సరైన మార్గనిర్దేశనం లేనప్పుడు వ్యతిరేకిస్తారు.
పరిష్కారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. విద్యార్థులు ఆశ్రయించే మొదటి కౌన్సెలర్లు వారే. ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించి, మేమున్నాం అని ధైర్యం చెప్పేలా వినడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పుడు విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు’అని వివరించింది.
స్వేచ్ఛా వాతావరణం..
నివేదిక ప్రకారం 40 శాతం మంది భారతీయ విద్యార్థులు ఎప్పు డూ కౌన్సెలర్‌తో మాట్లాడలేదు. అయితే ఈ సంఖ్య గత సంవత్సరం 52 శాతం నమోదైంది. ‘మానసిక ఆరోగ్యం పాఠశాల జీవితంలో రోజువారీ చర్యల్లో భాగం కావాలి. కౌన్సెలింగ్ నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలి’అని నివేదిక తెలిపింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ సంక్షోభం ఏర్పడిన తర్వాత మాత్రమే ‘మానసిక ఆరోగ్యం’గుర్తొస్తుందని వివరించింది. సమస్య రాకముందే నివారణ అవసరం. నమ్మకమైన పెద్దలు తరచూ సమావేశం కావడం ద్వారా విద్యార్థులకు మనోధైర్యం లభిస్తుందని తెలిపింది.
ఉపాధ్యాయులే కౌన్సిలర్లు..
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ భారీ నిధులు అవసరం లేదని, స్థిరమైన నిర్మాణం, సానుభూతి అవసరమని నివేదిక వివరించింది. ‘ప్రతి ఉపాధ్యాయుడు కౌన్సెలర్ పాత్ర పోషించడం ఒక ఆచరణాత్మక విధానం. ప్రాథమిక శిక్షణతో విద్యార్థుల బాధను ఉపాధ్యాయులు ముందుగానే గుర్తించగలరు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. పిల్లల బాధ యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో అవరి్టంగ్ స్టూడెంట్ సూసైడ్ టాస్‌్కఫోర్స్ అభివృద్ధి చేసిన గేట్ కీపర్ ట్రైనింగ్ వంటి తక్కువ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు సహాయ పడతాయి. స్టూడెంట్ వెల్‌నెస్ క్లబ్స్, టీచర్–సూ్టడెంట్ అడ్వైజరీ సర్కిల్స్ పాఠశాలల్లో విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు చవకైన మార్గాలు’అని తెలిపింది.
మానవ సంబంధాలు..
చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను 83 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సాంకేతికత మానవ సంబంధాన్ని భర్తీ చేయదని నివేదిక తెలిపింది. విద్యార్థులు త్వరిత సమాధానాల కోసం, లేదా పెద్దలను అడగడానికి సంకోచించినప్పుడు ఏఐ వైపు మొగ్గు చూపొచ్చు. కానీ మనోధైర్యం, జీవిత నిర్ణయాల విషయానికి వస్తే వారు ఇప్పటికీ నిజమైన మానవ సంబంధాన్ని కోరుకుంటారు. నమ్మకమైన పెద్దవారితో 15 నిమిషాల సంభాషణ పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’అని వివరించింది.
విద్యకు పునాదిగా..
విద్యార్థులకు నిజమైన మార్గదర్శకత్వం కావాలి. వారు చదువుతోనే కాదు.. భావోద్వేగాలు, మారుతున్న స్నేహాలు, గుర్తింపు, భవిష్యత్‌గురించి అనిశి్చతితో కూడా ఇబ్బంది పడుతున్నారు. వారు స్పష్టత, అనుబంధం, ఆత్మవిశ్వాసాన్ని కోరుకుంటున్నారు. పాఠశాల జీవితంలో మార్గదర్శకత్వం భాగం అయినప్పుడే ఇవి అందుకుంటారు. విద్యలో కౌన్సెలింగ్ పునాది కావాలి.
ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు పిల్లల గోడు వినడానికి, మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. మొత్తం అభ్యాస వాతావరణం మారుతుంది. సమస్యలను పరిష్కరించడంతోపాటు బలమైన, సంతోషకరమైన, మరింత నమ్మకమైన యువతను తీర్చిదిద్దుతుంది’అని వివరించింది.


