
అధ్యయన విధానాన్ని మారుస్తున్న సాధనాలు
సృజనాత్మకతను పెంపొందించడంలో సాయం
సమర్థవంతమైన సమయపాలనకూ దోహదం
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే సాంకేతికత. ఇది ఉద్యోగులకే కాదు.. అన్ని తరగతుల విద్యార్థులకు కూడా గొప్ప ఆయుధంగా అవతరించింది. వివిధ అంశాలను నేర్చుకునే విషయంలో సౌలభ్యమేకాదు.. క్రమశిక్షణా అలవాట్లను ఏర్పరచుకోవడం, సమయ పాలనా నిర్వహణ, సృజనాత్మకతను పెంపొందించుకోవడం వంటి ఎన్నో అంశాల్లో ఏఐ సాధనాలు విద్యార్థులకు దోహదపడుతున్నాయి. చాట్‌జీపీటీ, జెమినైతోపాటు అత్యంత ఉపయోగకరమైన ఏఐ టూల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
సమయ పాలన
రీక్లెయిమ్.ఏఐ: క్యాలెండర్‌ను ఆటోమేటిక్‌గా నిర్వహించే షెడ్యూలింగ్ సాధనం. అసైన్మెంట్స్‌ను ఎప్పుడు సవరించాలి, రాయాలో మాన్యువల్‌గా ప్లాన్ చేయడానికి బదులుగా.. విద్యార్థి ప్రస్తుత తరగతులు, క్రీడలు, అభిరుచులు, వ్యక్తిగత కార్యక్రమాలను స్కాన్ చేసి, అందుబాటులో ఉన్న ఖాళీ సమయంలో అధ్యయన సెషన్్సను నిర్ణయిస్తుంది.
నోషన్ ఏఐ: నోట్స్, టాస్క్‌లు, ప్రాజెక్ట్‌లు, విజ్ఞానాన్ని ఒకే చోటకు తీసుకొస్తుంది. డాక్యుమెంట్లలో ఉన్న సమాచారాన్ని క్యాప్చర్ చేయడానికి, వాటిని సారాంశాలుగా మార్చడానికి, అసైన్మెంట్స్‌ను ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని శోధించడానికి , నవీకరణకు సులభంగా అర్థమయ్యేలా స్టడీ డాష్‌బోర్డ్‌ను ఉంచడంలో సహాయపడుతుంది.
పరిశోధన, రచనలు
పర్‌ప్లెక్సిటీ.ఏఐ: విశ్వసనీయమైన వేదికలు (సోర్సులు), సంక్షిప్త సూచనలతో.. మన ప్రశ్నలకు సమాధానమిచ్చే పరిశోధన ఇంజిన్. గూగుల్‌లో స్క్రోల్ చేయడానికి బదులుగా వ్యాసాలు, నివేదికలు, ప్రాజెక్ట్‌లలో ఉదహరించగల ప్రత్యక్ష, విశ్వసనీయ విషయాలను నేరుగా పొందవచ్చు.
నోట్‌బుక్ ఎల్‌ఎమ్ (గూగుల్): క్లాస్ నోట్స్, పాఠ్యపుస్తకాలు, పీడీఎఫ్‌లను అప్‌లోడ్ చేసి ఈ మెటీరియల్‌కు సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు. విద్యార్థులు ఇచ్చే సిలబస్‌ను ఆధారం చేసుకుని శిక్షణ పొందిన ట్యూటర్ పాత్రనూ పోషిస్తుంది.
అధ్యయనం– అభ్యాసం
క్విజ్‌లెట్: నోట్స్‌ను సంక్షిప్త సమాచార ఫ్లాష్‌కార్డ్స్, ప్రాక్టీస్ పరీక్షలు, స్టడీ గేమ్స్‌గా మారుస్తుంది. విద్యార్థులు మెటీరియల్‌ను ఎంత బాగా గుర్తుంచుకుంటున్నారో దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. తద్వారా పాఠాలు తిరిగి చదవడం ఒక పనిలాగా, ఆసక్తి లేని విషయంగా కాకుండా ఆసక్తికరంగా మారుతుంది.
వూల్‌ఫ్రమ్ ఆల్ఫా: ఇది కేవలం కాలిక్యులేటర్ మాత్రమే కాదు.. సమాధానాలను గణిస్తుంది. ఫంక్షన్్సను గ్రాఫ్ చేస్తుంది. దశలవారీ గణిత, సైన్్స పరిష్కారాల ద్వారా ముందుకు నడిపిస్తుంది. చేసిన పనిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, భావనలను మరింత లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.
ఆటర్.ఏఐ (ఓటీటీఈఆర్): ఆడియో, వీడియోల కంటెంట్‌ను టెక్ట్స్‌గా మార్చే ట్రాన్స్క్రిప్షన్ సాధనం. ఉపన్యాసాలు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్్సను రికార్డ్ చేసి వాటిని సర్చ్ చేయదగిన టెక్ట్స్‌గా మారుస్తుంది. నోట్స్ రాసే వ్యక్తిగత సహాయకుడిగా ఉంటుంది.
కంటెంట్ సృష్టి – ప్రజెంటేషన్
కాన్వా: డ్రాగ్–అండ్–డ్రాప్ టెంప్లేట్స్‌తో పోస్టర్లు, స్లైడ్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలను సులభంగా రూపొందించవచ్చు. ఇతర ఏఐ సాధనాలు కేవలం టెక్ట్స్ వివరణ నుంచి ప్రారంభ స్థాయి డిజైన్్సను మాత్రమే రూపొందించగలవు. కానీ ఇది లే–అవుట్, స్టైలింగ్‌ను వేగవంతం చేస్తుంది. కిండర్‌గార్టెన్ నుంచి ఇంటర్ వరకు అందరి విద్యార్థులకూ ఉపయోగపడుతుంది.
గామా.యాప్: ప్రాంప్ట్‌ల నుంచి పూర్తి స్లైడ్ డెక్‌లు, సులభంగా అర్థమయ్యేలా ఒక పేజీలో డాక్యుమెంట్, సాధారణ సైట్స్‌ను కూడా రూపొందిస్తుంది. వాటికి తుదిమెరుగులు దిద్ది పీపీటీ, గూగుల్ స్లైడ్స్, పీడీఎఫ్‌లోకి మార్చడానికి వీలు కల్పిస్తుంది.
కస్టమైజబుల్ ఏఐ సాధనాలు
జెమినై జెమ్స్: సొంత, తేలికైన ఏఐ సాధనాలను సృష్టించడానికి అనుమతిస్తుంది. కథనాలను సంక్షిప్తంగా రూపొందించడం, కేస్ స్టడీస్ విశ్లేషణ, అధ్యయన అంశాలను తయారు చేయడం వంటి నిర్దిష్ట పనులు చేసిపెడుతుంది.
చాట్‌జీపీటీ స్టడీ మోడ్: చాట్‌జీపీటీ కేవలం ప్రశ్నోత్తరాలకే పరిమితమైన సాధనం కాదు. స్టడీ మోడ్ సాయంతో ప్రాజెక్ట్స్, వ్యక్తిగత, ప్రత్యేక జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్్డ ట్రాన్్సఫార్మర్స్‌తో (జీపీటీ) విద్యార్థులకు నిర్మాణాత్మక అధ్యయన సహాయకుడిగా కూడా సాయపడుతుంది.