50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ  | IBM commits to skill 5 million Indian youth in AI, Cybersecurity and Quantum | Sakshi
Sakshi News home page

50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ 

Dec 21 2025 4:09 AM | Updated on Dec 21 2025 4:09 AM

IBM commits to skill 5 million Indian youth in AI, Cybersecurity and Quantum

న్యూఢిల్లీ: 2030 నాటికి దేశీయంగా 50 లక్షల మంది యువతకు ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్వాంటమ్‌ మొదలైన సరికొత్త సాంకేతికతల్లో శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నట్లు టెక్‌ దిగ్గజం ఐబీఎం వెల్లడించింది. ఇందుకోసం ఐబీఎం స్కిల్స్‌బిల్డ్‌ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు వివరించింది. అంతర్జాతీయంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి శిక్షణ కల్పించాలన్న మిషన్‌లో భాగంగా భారత్‌లో దీన్ని చేపట్టినట్లు ఐబీఎం చైర్మన్‌ అరవింద్‌ కృష్ణ తెలిపారు. 

ఈ క్రమంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఒకేషనల్‌ కాలేజీలకు చేరువ కావడంతో పాటు ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)తో కూడా జట్టు కట్టనున్నట్లు వివరించారు. సరికొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలనేవి ఆర్థికంగా పోటీపడేందుకు, సాంకేతిక పురోగతికి, సమాజ పరివర్తనకు తోడ్పడతాయని కృష్ణ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement