
సాక్షి,విశాఖ: విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. విశాఖ కేజీహెచ్‌లో పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. అంనతరం,ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు స్క్రినింగ్ టెస్టులు చేయించారనేది అబద్ధం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. గురుకుల పాఠశాలలో శాటినేషన్ లోపమే కారణం.
ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించడం లేదు. అసలు ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో చెప్పాలి. ఇవాళ మరో ఆరుగురు విద్యార్థులు కేజీహెచ్ వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు’అని ’ధ్వజమెత్తారు.
