తిరుపతి: తిరుపతిలో దారుణం జరిగింది, చెన్నారెడ్డి కాలనీలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వాచ్‌మెన్ హరిగోపాల్ విద్యార్థులపై పైశాచిక దాడి చేశాడు. హాస్టల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి విద్యార్థులను గదికి పిలిపించుకుని బ్లూఫిల్మ్స్ చూపించి వికృత చేష్టలు చేస్తూ అసాంఘిక శృంగారంకు పాల్పడ్డాడు.
విద్యార్థులు భయంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో సదరు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక దాంతో వాచ్‌మెన్ చేసిన అసాంఘిక శృంగారంపై హాస్టల్ వార్డెన్ ముని శంకర్ దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు.
వెంటనే ఈ విషయంపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


