కొడితే సిక్సే!
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో క్రికెట్, షటిల్ ఇతర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ ఉద్యోగులతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు. కలెక్టరేట్‌లో మధ్యాహ్నం ఉద్యోగులకు క్విజ్ పోటీలు జరిగాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు నిర్వహించారు. డీఆర్వో మోహన్‌కుమార్ పోటీలను పర్యవేక్షించారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, పలమనేరు ఆర్డీవో గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
– చిత్తూరు కలెక్టరేట్
బ్యాటింగ్ చేస్తున్న కలెక్టర్
క్విజ్ పోటీలు
కొడితే సిక్సే!


