‘సర్వే’శ్వరా?
ఇంటింటికీ వెళ్తూనే ఉండండి
చిత్తూరు కలెక్టరేట్ : సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పూటకొక సర్వే పేరుతో ఇంటింటికీ తిప్పుతోంది. తాజాగా మరో కొత్త సర్వేకు శ్రీకారం చుట్టడంపై పలువురు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఈ సర్వేను నెల రోజుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలివ్వడంపై మండిపడుతున్నారు.
మూలిగే నక్కపై..
సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఒక రకంగా వారిని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పది మంది చేయాల్సిన పనిని ఒకరికి అప్పగించి తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే 14 సర్వేలు, బీఎల్‌ఓ విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం మోపింది. ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలను సేకరించాలి. ఈ నెల 15న సర్వే ప్రారంభించి జనవరి 12కు పూర్తి చేయాలి.
సర్వేలో సేకరించాల్సిన సమాచారం
వంద శాతం ఈ–కేవైపీ తప్పనిసరి. ప్రతి వ్యక్తి ఆధార్ ద్వారా వెరిఫై చేయాలి
మొబైల్ యాప్ సమాచారాన్ని డిజిటల్‌గా నమోదు చేయాలి
వ్యక్తిగత డేటా, కుటుంబ స్థాయి డేటా సేకరించాలి
పేరు, లింగ (జెండర్), పుట్టిన తేదీ, ఆధార్ సేకరణ తప్పనిసరి
మొబైల్ నంబరు– ఒక నంబరు ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ప్రస్తుత చిరునామాను డాక్యుమెంట్ ఆధారంతో చెక్ చేయాలి
నైపుణ్యాలు, వృత్తి, ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్, డాక్యుమెంట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి.
ఇంటి వివరాలు– నీటి సరఫరా, ఎల్‌పీజీ, విద్యుత్, టాయ్‌లెట్, రూఫ్ వంటివాటిని సర్వేయర్ వెరిఫై చేయాలి.
ఇంటి యజమాని (హౌజ్‌హోల్డ్) కలిగి ఉన్న ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ సామగ్రి, పశువులు, తదితర వివరాల నమోదు చేయాలి.
జిల్లా సమాచారం


