
విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యం
విద్యార్థినులను ఇళ్లకు పంపేసిన కేజీబీవీ
మంచిర్యాల రూరల్ (హాజీపూర్): బిల్లులు రా లేదని కాంట్రాక్టర్ రేషన్ సరుకులు పంపించ డం మానేశాడు. వారం రోజుల పాటు ఎస్‌వో స్వప్న విద్యార్థినుల ఆకలి తీర్చినా ఆర్థిక ఇబ్బందులు తాళలేక వారిని ఇళ్లకు పంపించేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణ మామిడి కేజీబీవీలో.. ఆరు నుంచి ఇంటర్ వరకు 240 మంది విద్యార్థినులు చదువుతు న్నారు. సరుకులను కాంట్రాక్టర్ రాజేందర్ సర ఫరా చేస్తుంటాడు.
నాలుగు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో.. సరఫరా నిలిపి వేశాడు. శనివారం సరుకులు ఖాళీ కావడంతో విద్యార్థులకు భోజన వసతి కల్పించడం కష్టంగా మారింది. ఇప్పటికే వారం రోజులు విద్యార్థులకు అల్పా హారం, భోజనం ఎస్‌వో ఏర్పాటు చేశారు. ఆర్థికభారం కావడం, రెండో శనివారం, ఆదివారం సెలవులు రావడంతో స్వప్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు.. విద్యా ర్థినుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. ఇంటర్, 10వ తరగతి విద్యా ర్థులకు తరగతులు నిర్వహిస్తుండగా.. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపించారు.