నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్) ఎం.ఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులకు శుభవార్త. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా)ఆధ్వర్యంలో నిర్వహించిన 10 రోజుల ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమానికి ఎస్సీఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది.
ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు ప్రయోగాలను వారి చేతులతో స్వయంగా చేసే అవకాశం లభించింది. పరిశ్రమ స్థాయి నైపుణ్యాలను పెంచే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ పల్లూ రెడ్డన్న, వారి బృందం చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. విద్యార్థులు తమ అకడమిక్ పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి, భవిష్యత్తులో పరిశ్రమలకు సిద్ధం కావడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడింది. ఇలాంటి విలువైన కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ఎస్సీఎస్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను, ఫాబా బృందాన్ని, విద్యార్థులను ప్రోత్సహించిన ప్రొఫెసర్ ప్రవీణ్‌ను యూనివర్సిటీ వర్గాలు అభినందించాయి.


