సార్‌.. మీరు వెళ్లొద్దు | Emotional Farewell For Headmaster Nannuri Venkat Reddy At Kukkadam School In Nalgonda | Sakshi
Sakshi News home page

సార్‌.. మీరు వెళ్లొద్దు

Nov 1 2025 10:11 AM | Updated on Nov 1 2025 10:23 AM

Students Emotional For Sir Transfer

హెచ్‌ఎం ఉద్యోగ విరమణ  పొంది వెళ్లిపోతుండడంతో  రోదించిన విద్యార్థులు  

నల్గొండ జిల్లా: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో గల మండల పరిషత్‌ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న నన్నూరి వెంకట్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మీరు వెళ్లొద్దు సార్‌.. మాతోనే ఉండాలి అంటూ రోదించారు. హెచ్‌ఎం వారిని ఓదార్చి వెళ్లిపోయారు. గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటమ్మ, నూతన హెచ్‌ఎం వీరయ్య, కేజీబీవీ ఎస్‌ఓ వసంతకుమారి, ఉపాధ్యాయులు నిరంజన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement