SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025, అర్హతలివే! | SBI Foundation announces SBI Platinum Jubilee Asha Scholarship 2025 | Sakshi
Sakshi News home page

SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025, అర్హతలివే!

Sep 19 2025 5:13 PM | Updated on Sep 19 2025 5:23 PM

SBI Foundation announces SBI Platinum Jubilee Asha Scholarship 2025

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) SBI ఫౌండేషన్, SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025ను ప్రకటించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా  వెనుకబడిన నేపథ్యాల నుండి 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సాధికారత కల్పిస్తుంది. తద్వారా  తరువాతి తరం నాయకులు, దేశ నిర్మాతలను తయారు చేయాలనేది  లక్ష్యం. దేశంలోని యువతకు మద్దతు ఇచ్చే చర్యల్లో భాగంగా SBI FY26లో స్కాలర్‌షిప్ కోసం రూ.90 కోట్లను కేటాయించింది.

2022లో స్థాపించబడిన SBI ఆశా స్కాలర్‌షిప్ కింద యువ భారతీయుల కలలు , ఆకాంక్షలను తీర్చనుంది. ఉన్నత విద్యను వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, వారి అభివృద్దితోపాటు,  దీర్ఘకాలికంగా దేశ నిర్మాణంపై కూడా దృష్టినిఇది ప్రతిబింబిస్తుంది.

ఈ స్కాలర్‌షిప్ 9వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల వరకు విద్యార్థులకు వర్తిస్తుంది, స్కాలర్ ఎంపిక చేయబడిన కోర్సు పూర్తయ్యే వరకు ఏటా  రూ.15,000 నుండి  రూ.20,00,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. 
పాఠశాల విద్యార్థులు (9–12 తరగతి)
NIRF టాప్ 300 లేదా NAAC A రేటింగ్ పొందిన సంస్థలు / కళాశాలలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు
IIT,IIM స్కాలర్స్‌
వైద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు
విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు
టాప్ 200 QS ర్యాంకింగ్ విశ్వవిద్యాలయాలలో విదేశాలలో మాస్టర్స్ , ఉన్నత విద్యను అభ్యసిస్తున్న SC/ST విద్యార్థులు

స్కాలర్‌షిప్‌కు అర్హతలు

 

  • దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి.

      గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.0 CGPA పొంది ఉండాలి

  • పాఠశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం  రూ.3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.

  • కళాశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి

దీనిపై ఎస్‌బీఐ,  చైర్మన్  చల్లా శ్రీనివాసులు సెట్టి మాట్లాడుతూ,  ఈ ఏడాది ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.  ఈ చొరవ ద్వారా  ఉన్నత విద్యనభ్యసించాలనే విద్యార్థులకు మద్దుతోపాటు, 2047 నాటికి విక్షిత్ భారత్ దార్శనికతకు అర్థవంతంగా దోహదపడేలా వారిని శక్తివంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

దరఖాస్తు విండో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు అధికారిక పోర్టల్: www.sbiashascholarship.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత వివరాలు , కేటగిరీ వారీగా ప్రయోజనాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement