breaking news
SBI Foundation
-
SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025, అర్హతలివే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) SBI ఫౌండేషన్, SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025ను ప్రకటించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సాధికారత కల్పిస్తుంది. తద్వారా తరువాతి తరం నాయకులు, దేశ నిర్మాతలను తయారు చేయాలనేది లక్ష్యం. దేశంలోని యువతకు మద్దతు ఇచ్చే చర్యల్లో భాగంగా SBI FY26లో స్కాలర్షిప్ కోసం రూ.90 కోట్లను కేటాయించింది.2022లో స్థాపించబడిన SBI ఆశా స్కాలర్షిప్ కింద యువ భారతీయుల కలలు , ఆకాంక్షలను తీర్చనుంది. ఉన్నత విద్యను వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, వారి అభివృద్దితోపాటు, దీర్ఘకాలికంగా దేశ నిర్మాణంపై కూడా దృష్టినిఇది ప్రతిబింబిస్తుంది.ఈ స్కాలర్షిప్ 9వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల వరకు విద్యార్థులకు వర్తిస్తుంది, స్కాలర్ ఎంపిక చేయబడిన కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15,000 నుండి రూ.20,00,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. పాఠశాల విద్యార్థులు (9–12 తరగతి)NIRF టాప్ 300 లేదా NAAC A రేటింగ్ పొందిన సంస్థలు / కళాశాలలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులుIIT,IIM స్కాలర్స్వైద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులువిదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులుటాప్ 200 QS ర్యాంకింగ్ విశ్వవిద్యాలయాలలో విదేశాలలో మాస్టర్స్ , ఉన్నత విద్యను అభ్యసిస్తున్న SC/ST విద్యార్థులుస్కాలర్షిప్కు అర్హతలు దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి. గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.0 CGPA పొంది ఉండాలిపాఠశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.కళాశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలిదీనిపై ఎస్బీఐ, చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి మాట్లాడుతూ, ఈ ఏడాది ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చొరవ ద్వారా ఉన్నత విద్యనభ్యసించాలనే విద్యార్థులకు మద్దుతోపాటు, 2047 నాటికి విక్షిత్ భారత్ దార్శనికతకు అర్థవంతంగా దోహదపడేలా వారిని శక్తివంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.దరఖాస్తు విండో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు అధికారిక పోర్టల్: www.sbiashascholarship.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత వివరాలు , కేటగిరీ వారీగా ప్రయోజనాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. -
కోవిడ్‌పై సీసీఎంబీ–ఎస్బీఐ పరిశోధన
సాక్షి, హైదరాబాద్: ‘ఎస్బీఐ ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్’ను భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ భాగస్వామ్యంతో పనిచేయనున్న సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరికి రూ.9.94 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ భారత్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలను మరింత ధృఢం చేసుకునే దిశలో ఎస్బీఐ సెంటర్ ఫర్ ఎక్స్‌లెక్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్ ఏర్పాటుకు సీఎస్ఐఆర్–సీసీఎంబీతో భాగస్వామ్యం కావడం తమ సంస్థకు ఎంతో గర్వకారణమని చెప్పారు. కోవిడ్‌ను అర్థం చేసుకునేందుకు అవసరమైన అమూల్యమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో భాగంగా ఎస్బీఐ ఫౌండేషన్ ఏర్పడిందని దినేష్ ఖారా తెలిపారు. కార్యక్రమంలో ముంబై డీఎండీ, సీడీవో ఓపీ మిశ్రా, హైదరాబాద్ డీఎండీ, ఐఏడీ ఆర్.విశ్వనాథన్, ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ మంజులా కల్యాణసుందరం, ఫౌండేషన్ బృందం సభ్యులు పాల్గొన్నారు. -
సీఎస్ఆర్ కోసం ఎస్బీఐ ఫౌండేషన్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిర్వహణ కోసం ముంబై కేంద్రంగా ‘ఎస్బీఐ ఫౌండేషన్’ను ఏర్పాటు చేసింది. ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు జూలై నుంచి ప్రారంభంకానున్నాయి. కంపెనీ లాభాల్లో 2 శాతాన్ని విధిగా సీఎస్‌ఆర్‌పై వెచ్చించాలని ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడానికి ముందు నుంచే తాము తమ సంస్థ లాభాల్లో ఒక శాతాన్ని సీఎస్ఆర్ మీద ఖర్చు చేస్తున్నామని ఎస్బీఐ సీఎస్ఆర్ జనరల్ మేనేజర్ వినోద్ పాండే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ.115 కోట్లను సీఎస్‌ఆర్‌పై వెచ్చించిందని తెలిపారు. ఈ ఫౌండేషన్‌కు ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చైర్మన్‌గా, మేనేజింగ్ డెరైక్టర్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించనున్నారు.


