విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణ.. | SC Seeks Compliance Report on Student Mental Health Rules | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణ..

Oct 28 2025 6:39 AM | Updated on Oct 28 2025 6:39 AM

SC Seeks Compliance Report on Student Mental Health Rules

మార్గదర్శకాల అమలుపై నివేదికివ్వండి

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం 

న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై గతంలో తాము జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై సవవివర నివేదికను 8 వారాల్లోగా సమరి్పంచాలని సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. 

విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను నివారించే లక్ష్యంగా జూలై 25వ తేదీన అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను వెలువరించింది. వాటి అమలుపై సోమవారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 90 రోజుల్లో అఫిడవిట్‌ సమరి్పంచాలని జూలైలో జరిపిన విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి విచారణను 2026 జనవరిలో చేపడతామని పేర్కొంది. 

గత విచారణ సమయంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులను పట్టి పీడిస్తున్న మానసిక ఆరోగ్య సంక్షోభం తీవ్రతను గుర్తించి, పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సంబంధించి దేశంలో ఏకీకృత, అమలు చేయదగిన చట్టపరమైన, నియంత్రణ విధానమేదీ లేకపోవడం శాసనపరమైన శూన్యతగా ధర్మాసనం అభివరి్ణంచింది. విశాఖపట్నంలో నేషనల్‌ ఎలిజిబిలిటీ–కమ్‌–ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)కు శిక్షణ పొందుతున్న 17 ఏళ్ల విద్యార్థి తనువు చాలించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జూలై 25వ తేదీన 15 మార్గదర్శకాలను వెలువరించింది. ప్రభుత్వం తగు విధానాలను అమల్లోకి తెచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement