breaking news
centre court
-
విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణ..
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై గతంలో తాము జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై సవవివర నివేదికను 8 వారాల్లోగా సమరి్పంచాలని సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను నివారించే లక్ష్యంగా జూలై 25వ తేదీన అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను వెలువరించింది. వాటి అమలుపై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 90 రోజుల్లో అఫిడవిట్ సమరి్పంచాలని జూలైలో జరిపిన విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి విచారణను 2026 జనవరిలో చేపడతామని పేర్కొంది. గత విచారణ సమయంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులను పట్టి పీడిస్తున్న మానసిక ఆరోగ్య సంక్షోభం తీవ్రతను గుర్తించి, పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సంబంధించి దేశంలో ఏకీకృత, అమలు చేయదగిన చట్టపరమైన, నియంత్రణ విధానమేదీ లేకపోవడం శాసనపరమైన శూన్యతగా ధర్మాసనం అభివరి్ణంచింది. విశాఖపట్నంలో నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు శిక్షణ పొందుతున్న 17 ఏళ్ల విద్యార్థి తనువు చాలించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జూలై 25వ తేదీన 15 మార్గదర్శకాలను వెలువరించింది. ప్రభుత్వం తగు విధానాలను అమల్లోకి తెచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. -
భారత్ అలవోకగా...
ఫైనల్‌కు చేరిన సానియా బృందం నేడు ఫిలిప్పీన్స్‌తో తుది పోరు ఫెడ్ కప్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2)లో భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో తుర్క్మెనిస్తాన్పై ఘన విజయం సాధించింది. భారత క్రీడాకారిణుల జోరు ముందు తుర్క్మెనిస్తాన్ అమ్మాయిలు ఏ మాత్రం ప్రతిఘటన కనబర్చకుండా తలవంచారు. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రార్థనా తోంబరే 6-0, 6-2తో జహానా బెరమోవాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ 51 నిమిషాల్లో ముగిసింది. రెండో సింగిల్స్‌లో కూడా అంకితా రైనా చెలరేగింది. ఈ మ్యాచ్‌లో అంకితా 6-1, 6-2తో అనస్తసియ ప్రెంకోను ఓడించింది. ఈ మ్యాచ్ ముగిసేందుకు 52 నిమిషాలు పట్టింది. సెమీస్ ఫలితం రెండు మ్యాచ్‌లకే తేలిపోవడంతో డబుల్స్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. మరో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్ 2-1 తేడాతో ఇండోనేసియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే ఫైనల్లో ఫిలిప్పీన్స్‌తో భారత్ తలపడుతుంది. శుక్రవారం జరిగిన ఇతర వర్గీకరణ మ్యాచ్‌లలో మలేసియా 2-0తో ఇరాన్‌పై... పసిఫిక్ ఓషియానియా 3-0తో సింగపూర్‌పై గెలుపొందాయి.


