ఎర్రగుంట్ల: మూడు ముళ్ల బంధానికి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అంతలోనే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఇది. ఆర్టీపీపీ స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెండ్రాయుడు కుమార్తె చందనజ్యోతి శనివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే చెండ్రాయుడు నివాసం ఉంటున్న ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆర్టీపీపీ స్టోర్ ఈఈ చెండ్రాయుడు కుమార్తె చందనజ్యోతి, కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌కు మూడు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరు హైదరాబాదులోని మూసాపేట్‌లో నివాసముంటున్నారు. అయితే ఏం జరిగిందో చందనజ్యోతి ఆత్యహత్య చేసుకున్నట్లు ఇక్కడికి సమాచారం అందింది. మృతదేహాన్ని ఆర్టీపీపీకి తీసుకుని వస్తున్నట్లు తెలిసింది.


