కొండాపురం: స్థానిక ఆర్‌అండ్‌ఆర్ పునరావాస కాలనీలో నివాసం ఉండే లక్ష్మీతులసి(36) అనే మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి వివరాల మేరకు కానిస్టేబుల్ వెంకటరమణ, లక్ష్మీతులసికి 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి లక్ష్మీతులసి ప్రొద్దుటూరులో ఇల్లు నిర్మించుకుందామని భర్తను అడిగింది.
అయితే వెంకటరమణ కడపలో ఇంటిని నిర్మించుకుందామని అక్కడే పిల్లలను చదివించుకోవచ్చు అని సూచించాడు. తన మాటలను పట్టించుకోవడంలేదని మనస్ధాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశామన్నారు.


