హైదరాబాద్: వినూత్నంగా ఆలోచించే విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో ఎన్నో అవకాశాలున్నాయని బోవర్స్ ఫౌండేషన్ ఫౌండర్ పవన్ అల్లెన అన్నారు. ఆదివారం మెరీడియన్ స్కూల్‌లో మైల్స్(మెరీడియన్ ఇన్నోవేషన్ లీడర్షిప్ ఎంట్రిప్రిన్యూర్‌షిప్ సమ్మిట్)2025 సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలికితీసేందుకు మైల్స్ సంస్థ ముందుకొచ్చిందని వారి వ్యాపారభివృద్దికి సంబంధించిని ఆలోచనలతో సంయుక్తంగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.. ఇందుకోసం టీ హబ్ తరహాలోనే ఆలోచనల విజ్ఞాన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

పాఠశాల సీఈవో తేజస్వి బుట్టా మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో నగరంలోని 21 పాఠశాలలకు చెందిన 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారని వారి వినూత్న ఆలోచనలను, ఆవిష్కరల గురించి ఈ సదస్సులో చర్చించి ప్రదర్శించినట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆలోచనలకు, ఆవిష్కరణల కోసం స్టేషన్ ఎం అనే వేదికను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మెరీడియన్ విద్యాసంస్థల ప్రెసిడెంట్ లలితా నాయుడు, ప్రిన్సిపాల్ కరణం భవాని, కమల్ కృష్ణ, సంధ్య, ఆర్యవీర్ తదితరులు పాల్గొన్నారు.


