రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి.


