గత కొన్నేళ్లుగా హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది లేకుండా పోయింది. వారం పదిరోజుల క్రితం 'మాస్ జాతర' అంటూ వచ్చాడు. యధావిధిగా ఇది కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో కొత్త మూవీని సిద్ధం చేశాడు. దీనికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల.. రవితేజ కొత్త చిత్రానికి దర్శకుడు. గ్లింప్స్ చూస్తుంటే కామెడీగా బాగానే ఉంది. రామసత్యనారాయణ (రవితేజ)ని అతడి జీవితంలోని ఇద్దరు ఆడోళ్లు రెండు ప్రశ్నలు అడుగుతారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి? వాటికి ఎవరూ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారనేదే స్టోరీలా అనిపిస్తుంది.
'నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. ఇలా అన్నింటినీ అడిగారు. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో' అని రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. భీమ్స్ సంగీతమందించాడు. వచ్చే సంక్రాంతికి మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ చూస్తుంటే ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)


