తమిళ హీరోయిన్ గౌరీ కిషన్‌ని 'మీ బరువెంత?' అని ఓ యూట్యూబర్ అడగడం, దానికి గౌరీ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం మీకు తెలిసే ఉంటుంది. మూడు నాలుగు రోజుల క్రితం ఈ వివాదం జరగ్గా.. గౌరీ ఓ నోట్ రిలీజ్ చేయడం, దీనికి ప్రతిగా సదరు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేయడంతో సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని గౌరీ ఇంకా వదలట్లేదు. తాజాగా చేసిన ట్వీట్ ఇందుకు ఉదాహరణ.
(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)
'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. మరీ ముఖ్యంగా.. ఆమె నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుంది. ఇది కేవలం సరదాగా అడిగాను. నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు' లాంటి మాటలు మాట్లడటం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సారీని నేను అంగీకరించట్లేదు' అని గౌరీ కిషన్.. యూట్యూబర్ కార్తీక్ వీడియోని రీట్వీట్ చేసింది. ఇదంతా చూస్తుంటే సదరు యూట్యూబర్‌పై మూవీ అసోసియేషన్ ఏదైనా చర్య తీసుకునే వరకు గౌరీ విచిచిపెట్టదేమో అనిపిస్తుంది.
గౌరీ కిషన్ విషయానికొస్తే.. '96' సినిమాలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ 'జాను'లోనూ నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు మూవీస్‌లో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ బాడీ షేమింగ్ వివాదం కూడా గౌరీ లేటెస్ట్ మూవీ 'అదర్స్' ప్రెస్ మీట్ సందర్భంగానే జరిగింది.
(ఇదీ చదవండి: డైరెక్టర్‌గా తళపతి విజయ్ కొడుకు.. టైటిల్ పోస్టర్ రిలీజ్)
An apology without accountability isn’t an apology at all.
Especially when it’s brushed off with “she misunderstood the question — it was just a fun one,” or worse — “I didn’t body-shame anyone.”
Let me be clear. I won’t accept performative remorse or hollow words. Do better, RS… https://t.co/OsIOegL9Hr— Gouri G Kishan (@Gourayy) November 10, 2025


