తండ్రి చివరి సినిమా.. కొడుకు మొదటి మూవీ అప్‌డేట్ | Thalapathy Vijay Son Jason First Movie Title Update | Sakshi
Sakshi News home page

Jason Sanjay: డైరెక్టర్‌గా తళపతి విజయ్ కొడుకు.. టైటిల్ పోస్టర్ రిలీజ్

Nov 10 2025 2:22 PM | Updated on Nov 10 2025 3:55 PM

Thalapathy Vijay Son Jason First Movie Title Update

తమిళ స్టార్ హీరో తళపతి విజయ్.. తన చివరి సినిమా బిజీలో ఉన్నాడు. 'జన నాయగణ్' పేరుతో తీస్తున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్‌గా తొలి పాటని రిలీజ్ చేశారు. లాస్ట్ డ్యాన్స్ పేరుతో 'తళపతి కచేరీ' సాగే ఈ గీతం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇదలా ఉండగానే ఇప్పుడు విజయ్ కొడుకు తొలి మూవీ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.

(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)

తళపతి విజయ్‌కి జేసన్ సంజయ్ అని కొడుకు ఉన్నాడు. తండ్రిలా ఇతడు కూడా హీరో అవుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ దర్శకుడిగా తొలి మూవీ చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం అందరికీ షాకిచ్చాడు. టాలీవుడ్‌కి చెందిన సందీప్ కిషన్.. ఈ ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా దీని నుంచి అప్‌డేట్ వచ్చింది. మూవీకి 'సిగ్మా' అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో డబ్బు, బంగారం లాంటివి చాలా చూపించారు. అలానే సిగ్మా అనే పదాన్ని ఎక్కువగా యాటిట్యూడ్ చూపించే కుర్రాళ్లు, మగాళ్ల గురించి ఉపయోగిస్తారు. చూస్తుంటే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. తమన్ సంగీత దర్శకుడు కాగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. తండ్రి విజయ్ చివరి సినిమా చేస్తున్నప్పుడే కొడుకు.. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వస్తుండటం ఆసక్తికరంగా మారింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement