breaking news
Gouri G. Kishan
-
నటి బ్లౌజుపై వెకిలి కామెంట్.. హీరోలనూ వదల్లేదు!
ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.సినిమా ఈవెంట్స్‌లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...ఛీ కొట్టే ప్రశ్న'తెలుసు కదా' ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!హీరో మెటీరియల్ కాదా?దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో కూడా.. ప్రదీప్ రంగనాథన్‌ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.బుద్ధి చెప్పిన మంచు లక్ష్మిహీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్‌కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.స్లీవ్‌లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్‌కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్‌లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.మీ బరువెంత?గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్లో హీరోయిన్ గౌరీ కిషన్‌ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్మీట్లో ఓ విలేకరి.. హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో! -
96 మ్యాజిక్ రిపీట్ అవుతుందా!
96 చిత్రం ద్వారా ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ వెండితెరకు పరిచయమయ్యారు. 96 చిత్రంలో హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటించారు. ఆ మూవీ విజయంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆదిత్య భాస్కర్ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్న ఎంఎస్.భాస్కర్ వారసుడు అన్నది గమనార్హం. తాజాగా ఆదిత్య భాస్కర్, గౌరికిషన్ హీరో హీరోయిన్లుగా జత కట్టారు. ఈ చిత్రాన్ని ఆర్జిన్ స్టూడియోస్ పతాకంపై కన్నదాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిఈ మూవీ ద్వారా రాజ్‌కుమార్ రంగసామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సరస్వతి మీనన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, రెడిన్ కింగ్స్లీ, డీఎస్ఆర్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. 96 మ్యాజిక్ రిపీట్!జనరంజకమైన అంశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఈ మూవీ కథ ఉంటుందన్నారు. 96 చిత్రం ఫేమ్ ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ల మ్యాజిక్ ఈ చిత్రంతో మరోసారి వర్కౌట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర టైటిల్‌ను ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎస్.రామచంద్రన్ చాయాగ్రహణం, ఎంఎస్.జోన్స్ రాబర్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని హీరోయిన్
తమిళ హీరోయిన్ గౌరీ కిషన్‌ని 'మీ బరువెంత?' అని ఓ యూట్యూబర్ అడగడం, దానికి గౌరీ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం మీకు తెలిసే ఉంటుంది. మూడు నాలుగు రోజుల క్రితం ఈ వివాదం జరగ్గా.. గౌరీ ఓ నోట్ రిలీజ్ చేయడం, దీనికి ప్రతిగా సదరు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేయడంతో సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని గౌరీ ఇంకా వదలట్లేదు. తాజాగా చేసిన ట్వీట్ ఇందుకు ఉదాహరణ.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. మరీ ముఖ్యంగా.. ఆమె నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుంది. ఇది కేవలం సరదాగా అడిగాను. నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు' లాంటి మాటలు మాట్లడటం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సారీని నేను అంగీకరించట్లేదు' అని గౌరీ కిషన్.. యూట్యూబర్ కార్తీక్ వీడియోని రీట్వీట్ చేసింది. ఇదంతా చూస్తుంటే సదరు యూట్యూబర్‌పై మూవీ అసోసియేషన్ ఏదైనా చర్య తీసుకునే వరకు గౌరీ విచిచిపెట్టదేమో అనిపిస్తుంది.గౌరీ కిషన్ విషయానికొస్తే.. '96' సినిమాలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ 'జాను'లోనూ నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు మూవీస్‌లో హీరోయిన్గా చేస్తోంది. ఈ బాడీ షేమింగ్ వివాదం కూడా గౌరీ లేటెస్ట్ మూవీ 'అదర్స్' ప్రెస్ మీట్ సందర్భంగానే జరిగింది. (ఇదీ చదవండి: డైరెక్టర్‌గా తళపతి విజయ్ కొడుకు.. టైటిల్ పోస్టర్ రిలీజ్)An apology without accountability isn’t an apology at all.Especially when it’s brushed off with “she misunderstood the question — it was just a fun one,” or worse — “I didn’t body-shame anyone.”Let me be clear. I won’t accept performative remorse or hollow words. Do better, RS… https://t.co/OsIOegL9Hr— Gouri G Kishan (@Gourayy) November 10, 2025 -
టాప్ లేపిన కేతిక.. క్యూట్ పోజుల్లో హన్సిక!
96 బ్యూటీ గౌరీ క్యూట్ పోజులు బ్లాక్ టాప్‌తో రచ్చ లేపుతున్న కేతిక చీరకట్టులో హాట్ బ్యూటీ అనన్య పాండే అందాలు చూపిస్తున్న హన్సిక ర్యాంప్ వాక్ లో హీరోయిన్ ప్రణీత అందాల విందుతో కేక పుట్టిస్తున్న నిక్కీ 'ఉస్తాద్' బ్యూటీ కావ్య లేటెస్ట్ స్టిల్స్ బ్లాక్ టాప్ లో కోమలి ప్రసాద్ వయ్యారాలు View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
యంగ్ హీరోయిన్ టాటూ.. చూపించుకోలేని ప్లేసులో అలా!
'96' సినిమా పేరు చెప్పగానే ఓ అందమైన లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. చిన్నప్పటి త్రిషగా చేసిన నటి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. అలాంటి ఆ బ్యూటీ తన బాడీలో ఎవరికీ చూపించుకోలేని ఓ చోట టాటూ వేసుకుని హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: డేట్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్) 96 రీమేక్ గా తెలుగులో తీసిన 'జాను'లోనూ నటించిన గౌరీ కిషన్.. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన గౌరీ.. తన ఒంటిపై టాటూ వేసుకుంటున్న చిన్న వీడియోని స్టోరీలో పోస్ట్ చేసింది. అది ఎక్కడ అనేది చెప్పుకోండి అని చిన్న పజిల్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికి తన రిబ్స్‌పై పచ్చబొట్టు వేసుకున్నానని చెబుతూ ఓ పిక్ షేర్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ టాటూ పిక్ కాస్త వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్)


