‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Bhartha Mahasayulaku Wignyapthi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Bhartha Mahasayulaku Wignyapthi Review: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ హిట్టా? ఫట్టా?

Jan 13 2026 12:25 PM | Updated on Jan 13 2026 1:52 PM

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review And Rating In Telugu

టైటిల్‌ : భర్త మహాశయులకు విజ్ఞప్తి
నటీనటులు: రవితేజ, డింపుల్హయతి, ఆషికా రంగనాథ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, సునీల్తదితరులు
నిర్మాణ సంస్థ: ఎస్ఎల్‌వి సినిమాస్
నిర్మాత: చెరుకూరి సుధాకర్
దర్శకత్వం: కిషోర్తిరుమల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
విడుదల తేది: జనవరి 13, 2023

ముగ్గుల పండక్కి టాలీవుడ్ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమాభర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి చిత్రంతో అయినా రవితేజ హిట్ట్రాక్ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
రామ సత్యనారాయణ అలియాస్రామ్‌(రవితేజ) వైన్యార్ట్ఓనర్‌. తాను కొత్తగా రెడీ చేసినఅనార్కలివైన్‌ని స్పెయిన్‌లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్‌ చేస్తారు.  కారణం తెలుసుకునేందుకు స్పెయిన్‌ వెళ్లిన రామ్‌.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్‌)తో ఫిజికల్గా దగ్గరవుతాడు. విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్‌ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ఏం చేశాడు? స్పెయిన్లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్‌.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్‌), సుదర్శన్‌(సునీల్‌)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు  తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే.  ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే  ఈ సినిమా కథ.  దర్శకుడు తిరుమల కిషోర్‌ ఎంచుకున్న పాయింట్‌ చాలా రొటీన్‌. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్‌కు తగ్గట్లు ప్రెష్‌గా ఉన్నాయి.  

మీమ్స్‌ కంటెంట్‌ని బాగా వాడుకున్నాడు.  సోషల్‌ మీడియాని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు  కొన్ని సీన్లకు బాగా కనెక్ట్‌ అవుతారు. అయితే ఏ జోనర్‌ సినిమాకైనా ఎమోషన్‌ అనేది చాలా ముఖ్యం.  ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్‌ అయింది.  మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్‌ మోడల్‌ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. 

అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్‌ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు.  ఫస్టాఫ్‌లో సత్య, కిశోర్‌ల కామెడీ  సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్‌ ఎపిసోడ్‌ వరకు చాలా ఎంటర్‌టైనింగ్‌గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది.  హైదరాబాద్‌ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. 

మొత్తంగా పస్టాఫ్‌లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి..  బోర్‌ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఆ కామెడీ డోస్‌ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్‌లో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్‌ సీన్‌ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్‌ కలుగుతుంది.  ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

ఎవరెలా చేశారంటే.. 
రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్‌ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్‌, సత్య, సునీల్‌ల కామెడీ ఈ సినిమాకు ప్లస్‌ అయింది. మరళీధర్‌ గౌడ్‌ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే.  పిన్నీ సీరియల్‌ సాంగ్‌తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి.  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement