రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను పంచుకునా్నరు మేకర్స్.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు(బుధవారం) గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది.
ముఖ్యంగా రవితేజ ఇద్దరు భామల (ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి) మధ్య నలిగిపోయే లవ్ ట్రయాంగిల్ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. భీమ్స్ సంగీతం మా సినిమాకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా ‘వామ్మో వాయ్యో...’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. రవితేజ మేనరిజమ్స్, స్టెప్పులు ఈ పాటను హిట్‌గా మార్చేశాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది.


