'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్‌.. రవితేజ మాస్‌ డ్యాన్స్‌ | Karthika Deepam Remix Song Released from Bhartha Mahasayulaku Wignyapthi Movie | Sakshi
Sakshi News home page

కార్తీకదీపం రీమిక్స్‌ సాంగ్‌.. పబ్‌లో రవితేజ మాస్‌ స్టెప్పులు

Jan 18 2026 6:17 PM | Updated on Jan 18 2026 6:21 PM

Karthika Deepam Remix Song Released from Bhartha Mahasayulaku Wignyapthi Movie

ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్‌ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. 

ఆరనీకుమా ఈ దీపం సాంగ్‌
ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్‌ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్‌ప్రైజ్‌ అయ్యారు. స్క్రీన్‌పై రవితేజ మాస్‌ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్‌ సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. పబ్‌లో హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌తో మాస్‌ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..

సినిమా
సినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్‌వీఎల్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

 

చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement