గడిచిన కాలం మళ్లీ రాదంటారు. కుదిరితే గడిచిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకుని ఏదో కాస్త సంతోషపడటమే! అందుకు 2016 ట్రెండ్ బాగా ఉపయోగపడుతోంది. సడన్‌గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ అప్పటి వేడుకలను, జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్ చేస్తున్నారు. అలా బిగ్‌బాస్ బ్యూటీ పై ఫోటో షేర్ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
2016 నాటి మెమొరీస్
బుల్లితెర నటి ప్రియాంక జైన్.. ఓవైపు మోడ్రన్ డ్రెస్‌లో సెల్ఫీలు, మరోవైపు అమ్మవారి వేషధారణ. ఇంకో ఫోటోలో అయితే రెండు జడలు వేసుకుని పిండి రుబ్బుతోంది. ఈ ఫోటోల్లో ప్రియాంక మరీ చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే.. మౌనరాగం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్‌తో మరింత పాపులరైంది.
ప్రియుడితో..
తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొనగా టాప్ 5గా నిలిచింది. మౌనరాగం సీరియల్ సహనటుడు శివకుమార్‌తో ప్రేమలో పడగా.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 2024 ఏప్రిల్‌లో వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ చోట భూమి కొన్నారు. గతేడాది మంచి ముహూర్తం చేసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఈ లెక్కన ఈ ఏడాది కొత్తింట్లోకి వీరు జంటగా గృహప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


