టాలీవుడ్ పవర్‌ఫుల్ కపుల్ నాగార్జున (Nagarjuna Akkineni)-అమల.. కిరాయిదాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో శివ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 1989 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది.
శివ సాంగ్‌తో ఎంట్రీ
అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీరిలీజ్ (Siva Movie ReRelease) చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ స్టేజీపైకి ఆర్జీవీతో పాటు శివ రీల్ కమ్ రియల్ లైఫ్ హీరోయిన్ అమల సైతం వచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో నాగార్జున.. బోటనీ పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. పాటతో ఎంట్రీ ఇచ్చాడు.

అమలతో నాగ్ డ్యాన్స్
ఆ వెంటనే అమల రంగంలోకి దిగి.. నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ జంట కోసం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సైతం జోడీలుగా విడిపోయి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో వారు డ్యాన్స్ చేస్తుంటే స్టేజీపై అమల ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. నిన్ను బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులు ఉండమంటే ఉంటావా? అని నాగ్.. ఆర్జీవీని అడిగాడు. అందుకాయన.. అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలుంటే కచ్చితంగా ఉంటానన్నాడు వర్మ.


