సెలబ్రిటీలందరికీ కామన్ ఫ్రెండ్ ఓరీ (Orhan Awatramani). ఎక్కడైనా ఏదైనా పార్టీ జరుగుతుందన్నా.. ఈవెంట్ అవుతుందన్నా వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. హీరోహీరోయిన్లపై చేతులు వేసి చనువుగా ఫోటోలు దిగుతుంటాడు. ముఖ్యంగా జాన్వీ, ఖుషి కపూర్‌లకైతే బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. విచిత్ర వేషధారణతో కనిపించే ఓరీ.. తాజాగా విమర్శలపాలయ్యాడు.
ఆడవేషంలో ఉన్నవారిపై జోక్స్
కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) నిర్వహిస్తున్న టాలెంట్ షో ఆంటీ కిస్కో బోలాకి ఓరీ హాజరయ్యాడు. ఆడవారిలా చీర కట్టుకుని రెడీ అయిన అబ్బాయిల మధ్యలో ఓరీ కూర్చున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఓ కామెడీ షోకి వచ్చా.. ఇద్దరు చెక్కగాళ్లు నా ముందే గొడవపడుతున్నారు. ఇలా కొట్టుకుంటున్నారేంటి? అని రాసుకొచ్చాడు.
సరదాగా ఉందా?
ఈ వీడియో వైరల్‌గా మారగా ఓరీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్క అనే పదాన్ని వాడటం నీకు సరదాగా ఉందా? అలా ఎలా అనగలిగావు? కొంచెమైనా బుద్ధి లేదా? అని మండిపడుతున్నారు. కొందరు పేరుకే ధనవంతులు కానీ, విలువలు తెలియవు.. ఒక కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆగ్రహిస్తున్నారు.
ఓరీ ఏం చేస్తుంటాడు?
ఓరీ.. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. ఇతడు న్యూయార్క్‌లో మోడలింగ్ నేర్చుకున్నాడు. న్యూయార్క్‌లో పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గానూ వర్క్ చేశాడు. సెలబ్రిటీల పార్టీలకు మాజరై అక్కడున్నవారితో ఫోటోలు దిగుతాడు. ఇలా పార్టీలకు వెళ్లి, ఫోటోలు దిగి రూ.20-30 లక్షలు సంపాదిస్తాడు. మోడల్‌గానూ ప్రాజెక్టులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. తనకు ఐదుగురు మేనేజర్లున్నారు.
చదవండి: నాకోసం యుద్ధాలు చేయాలి.. విజయ్‌నే పెళ్లాడతా..: రష్మిక


