'బిగ్‌బాస్‌' కెప్టెన్సీ టాస్క్‌లో నటికి తీవ్ర గాయం (వీడియో) | Bigg Boss Tamil 9: VJ Parvathy Injured in Task, Continues in House Despite Pain | Sakshi
Sakshi News home page

'బిగ్‌బాస్‌' కెప్టెన్సీ టాస్క్‌లో నటికి తీవ్ర గాయం (వీడియో)

Nov 12 2025 11:06 AM | Updated on Nov 12 2025 11:54 AM

Bigg Boss Tamil 9 injured VJ Paaru with Sabari physically task

బిగ్ బాస్ తమిళ సీజన్ 9లో VJ పార్వతి అనే కంటెస్టెంట్‌ తీవ్రంగా గాయపడింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఆమె కంటికి గాయం కావడంతో చాలా ఇబ్బంది పడింది.  ‘BB బాటిల్ హంట్’ ఛాలెంజ్ సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే, ఆమె గాయపడినప్పటికీ హౌస్‌లో కొనసాగుతానని చెప్పడం విశేషం. ఈ షో తన కెరీర్‌కు చాలా అవసరమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పోరాడుతానని ఈ సీజన్‌లో కొనసాగుతుంది.

బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నటుడు శబరి నాధన్‌ చేతిలో పార్వతి గాయపడింది.  టాస్క్‌లో భాగంగా పొరపాటున అతని మోకాలు పార్వతి కంటికి చాలా బలంగా తగిలింది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో తల్లడిల్లింది. ప్రస్తుతం ఆమె కన్ను భాగం అంతా చాలా వాపు వచ్చినప్పటికీ హౌస​్‌లో కొనసాగుతూనే ఉండటం విశేషం. ప్రస్తుతం బిగ్‌బాస్‌ టైటిల్‌ రేసులో టాప్‌-3లో పార్వతి ఉంది. పార్వతి తమిళనాడులో టీవీ యాంకర్‌గా పనిచేస్తుంది. ఆపై పాపులర్‌ రేడియో జాకీగా గుర్తింపు ఉంది. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో చాలా కష్టాలు పడ్డామని హౌస్‌లోకి వెళ్లే సమయంలో హౌస్ట్‌ విజయ్‌ సేతుపతికి చెప్పింది. ముగ్గురు సంతానం కలిగిన కుటుంబాన్ని తన అమ్మగారే ఒక సూపర్‌ హీరోలా పోషించిందని చెప్పింది. 

అయితే, ప్రస్తుతం కుటుంబ బాధ్యతలన్నీ తనమీదే ఉన్నాయని పేర్కొంది. పార్వతికి గాయం తగిలినప్పుడు హౌస్‌ నుంచి వెళ్లిపోవాలని బిగ్‌బాస్‌ సూచిస్తాడు. కానీ, తనకు ఈ షో చాలా అవసరమని కొనసాగుతానని ఆమె చెప్పింది. ప్రస్తుతం గాయంతోనే ప్రేక్షకులను ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. తెలుగులో ఇమ్మాన్యూయేల్‌ ఎలాగో తమిళ్‌ బిగ్‌బాస్‌లో పార్వతి  ఆట కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement