భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్‌ ఏమందంటే? | Sana Khan Denies she was Brainwashed by her Husband to quit Cinemas | Sakshi
Sakshi News home page

భర్తే సినిమాలు మాన్పించాడా? హీరోయిన్‌ ఆన్సరిదే..

Jan 17 2026 4:12 PM | Updated on Jan 17 2026 4:57 PM

Sana Khan Denies she was Brainwashed by her Husband to quit Cinemas

ఒకప్పుడు గ్లామర్‌తో అల్లాడించిన హీరోయిన్‌ సనా ఖాన్‌ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. 2020 అక్టోబర్‌లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.

నేనే కోరుకున్నా..
తాజాగా ఈ రూమర్‌పై సనాఖాన్‌ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే..  అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్‌తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. 

నా భర్త వల్లే..
గతంలో హిజాబ్‌ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్‌ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.

అందుకే సినిమాలు వదిలేశా..
ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.

సినిమా
హీరోయిన్‌ సనా ఖాన్‌.. గగనం, కత్తి, మిస్టర్‌ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ 6వ సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్‌ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్‌.. నా మతం వల్లేనేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement