8 ఏళ్లుగా అవకాశాల్లేవ్‌.. నా మతంవల్లేనేమో! | AR Rahman Says he Lost work in Bollywood in the Last 8 years | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో తగ్గిన అవకాశాలు.. మతం చూసి వెనకడుగు!

Jan 17 2026 2:12 PM | Updated on Jan 17 2026 2:24 PM

AR Rahman Says he Lost work in Bollywood in the Last 8 years

సంగీత ప్రపంచంలోనే అగ్రజుడు ఏఆర్‌ రెహమాన్‌. కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించాడు. పుట్టుకతోనే హిందూ అయిన ఇతడు తర్వాత ముస్లిం మతానికి మారిపోయాడు. అయితే తాను ముస్లిం అవడం వల్ల బాలీవుడ్‌లో సరైన అవకాశాలు రాలేదంటూ అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఔట్‌ సైడర్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. రోజా, బాంబే, దిల్‌సే వంటి హిట్‌ సినిమాలకు సంగీతం అందించినప్పటికీ నేను బాలీవుడ్‌లో ఔట్‌సైడర్‌ (ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని వ్యక్తి)లానే ఫీల్‌ అయ్యేవాడిని. కానీ తాల్‌ సినిమా పాటలు అందరి ఇంట్లోకి చేరాయి. ఇప్పటికీ ఎంతోమంది ఉత్తరాదివాళ్లు ఆ మూవీ పాటలు వింటూనే ఉంటారు. ఎందుకంటే అందులో కొంత పంజాబీ, కొంత హిందీ మ్యూజిక్‌ మిక్స్‌ అయి ఉంటుంది.

8 ఏళ్లుగా తగ్గిన అవకాశాలు
అప్పుడు నాకు పంజాబీ సంగీతంపై మరింత ఆసక్తి కలిగింది. అలా సుక్వీందర్‌ సింగ్‌ను కలిశాను. తనతో కలిసి చేసిన 'చయ్య చయ్య', 'జై హో..' పాటలు ఎంత ఆదరణ పొందాయో మీ అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిదేళ్లుగా నాకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. బహుశా దీనికి ఇండస్ట్రీలో మారిన పవర్‌ షిఫ్ట్‌ ఒక కారణమైతే.. నా మతం కూడా మరో కారణం కావొచ్చు. ఏదేమైనా నాకు నా కుటుంబానితో గడిపేందుకు సమయం దొరికిందనుకుంటాను. 

అవే నా దగ్గరకు..
అయినా పనికోసం నేను పాకులాడటం లేదు. పనే నా దగ్గరకు రావాలని అనుకుంటాను. నా వృత్తిపట్ల నాకున్న నిబద్ధతే నాకు అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. రెహమాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. మతమే అడ్డంకైతే ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు వచ్చేవే కాదని పలువురు సోషల్‌ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. రామాయణం మూవీలో ఛాన్స్‌ నీ మతం చూసే ఇచ్చారా? అని మండిపడుతున్నారు. 

చదవండి: ధనుష్‌తో మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement