కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.
ఇంత సడన్‌గా పెళ్లేంటి?
అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్‌గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్‌కు ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. ధనుష్ చివరగా తేరే ఇష్క్ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ చివరగా సన్ ఆఫ్ సర్దార్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్‌గా నటించిన డెకాయిట్ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.


