బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో పదకొండోవారం కెప్టెన్ రీతూ అన్న విషయం ఈపాటకే బయటకు వచ్చేసింది. అయినప్పటికీ అదేదో సస్పెన్స్ అన్నట్లుగా సాగదీస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ వేయనేలేదు. ఈరోజు ఎపిసోడ్‌లో సుమన్, రీతూ కెప్టెన్సీ కోసం ఎలా పోటీపడ్డారో చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు.
బోల్తా కొట్టిన సుమన్
ఇందులో సుమన్ చకచకా ఆడేశాడు. చివర్లో ఓ బోర్డు సెట్ చేస్తుంటే సంచాలక్‌గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. పర్లేదు, వెళ్లు వెళ్లంటూ పంపించేసింది. అలా ఫస్ట్ సుమన్ కెప్టెన్ అని రాసున్న జెండా ఎగరేశాడు. కొద్ది క్షణాల తేడాతో రీతూ జెండా ఎగరేసింది. అయితే సుమన్ చివరి బోర్డ్ సరిగా పెట్టలేదని డిమాన్ పవన్ ప్రశ్న లేవనెత్తాడు. అది దగ్గరుండి మరీ చూపించాడు.
సైలెంట్ అయిన తనూజ
దాంతో తనూజ.. వాళ్లిద్దరు ఫైట్ చేసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? నువ్వేంటి చెప్పేది? అని పవన్‌ను తీసిపడేసింది. ఇంతలో కల్యాణ్.. నువ్వు డిక్లేర్ చేశాకే సుమన్ చివరి బోర్డ్ వదిలేశాడని వాదించాడు. దీంతో తనూజ సైలెంట్ అయిపోయింది. తనూజ చేసిన ఆగం పని వల్ల సుమన్ బలైపోయాడు. రీతూ కెప్టెన్ అయింది.
చదవండి: సీజన్‌లో పెద్ద లొల్లి.. సీరియల్ స్టార్ వర్సెస్ సింపతీ స్టార్


