హైట్‌తోనే సమస్య.. డేటింగ్‌పై 'బిగ్‌బాస్‌ దివి' కామెంట్స్‌ | Bigg boss Divi Comment Her Love and dating Story | Sakshi
Sakshi News home page

హైట్‌తోనే సమస్య.. డేటింగ్‌పై 'బిగ్‌బాస్‌ దివి' కామెంట్స్‌

Jan 26 2026 9:11 AM | Updated on Jan 26 2026 9:11 AM

Bigg boss Divi Comment Her Love and dating Story

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షో  ద్వారా చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. అలా నాలుగో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన బ్రేకప్ లవ్ స్టోరీతో పాటు మరోసారి డేటింగ్‌ ప్లాన్‌లో ఉన్నానని చెప్పి షాకిచ్చింది. అయితే, ప్రస్తుతానికి తనకు సరైన జోడీ దొరకడం లేదని తెలిపింది. ప్రధానంగా తన హైట్‌ సమస్యగా మారిందని పేర్కొంది.

బిగ్‌బాస్‌ దివి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన లవ్‌ బ్రేకప్‌ గురించి ఇలా చెప్పింది. 'ఒకప్పుడు బ్రేకప్‌ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. కొంత కాలం పాటు కలిసి ఉన్న వ్యక్తి దూరం అయితే ఎవరిలోనైనా సరే చాలా బాధ ఉంటుంది. నేను కూడా చాలారోజుల పాటు ఏడ్చాను. మరోకరు మన జీవితంలోకి వచ్చేవరకు ఆ డిప్రెషన్‌ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఆ బ్రేకప్‌ తర్వాత నేను ఒక నటిగా మారాను. సినిమా, ఫోటో షూట్‌ ఛాన్స్‌లు వచ్చాయి. చాలా ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయాను. దీంతో త్వరగానే కోలుకున్నాను. 

అయితే, ప్రస్తుతం నేను డేటింగ్‌ చేసేందుకు ప్లాన్‌లో ఉన్నాను. కానీ, నాకు నచ్చిన వ్యక్తి దొరకడం లేదు. కొందరు దొరికినప్పటికీ వారితో నేను కనెక్ట్‌ కాలేకపోతున్నాను. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నాను. నా హైట్‌కు తగిన అబ్బాయి దొరకాలంటే కనీసం ఆరు అడుగులు ఉండాలి. ప్రస్తుతం ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏదీ సెట్ కావట్లేదు. నాకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా  తెలియడం లేదు.' అని దివి పేర్కొంది.

బ్రేకప్‌ ఎందుకు అయిందంటే..
దివి గతంలో తన బ్రేకప్‌ స్టోరీని చెప్పింది. విడిపోవడానికి కారణం కూడా ఇలా తెలిపింది. 'బీటెక్ చదివే రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం. ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం. పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి కూడా అంగీకరించారు. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఇంతలోనే అతడి తమ్ముడి.. అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. అయితే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఎందుకంటే అతడి చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. అలానే చనిపోయిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్‌కి తోడుగా ఉన్నాను'

'ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనమవుతుందని అనుకున్నాడు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఒకవేళ ఇది ముందే తెలుసుంటే అతడితో పాటు నేను వాళ్ల ఊరికి వెళ్లిపోయేదాన్నేమో' అని దివి తన ట్రాజెడీ ప్రేమకథ గురించి బయటపెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement