రీతూ చౌదరి.. విపరీతమైన నెగెటివిటీతో తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో పాల్గొంది. డిమాన్ పవన్‌తో లవ్ ట్రాక్ వల్ల మరింత వ్యతిరేకత మూటగట్టుకుంది. అయితే ఆమె చూపించే ప్రేమ నిజమైనదని రానురానూ ప్రేక్షకులే ఓ అంచనాకు వచ్చారు. ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్ కోసం నిలబడే విధానం చూసి ముచ్చటపడ్డారు.
బిగ్‌బాస్‌లో ఉండగా రీతూపై ఆరోపణలు
అవతలి వ్యక్తి దిగజారుతూ మాట్లాడినా సహనం కోల్పోకుండా కౌంటరిచ్చిన ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలా నెగెటివిటీని పాజిటివిటీ మల్చుకుని బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చింది రీతూ చౌదరి. అయితే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి తనపై సంచలన ఆరోపణలు చేసింది.
నెగెటివిటీపై స్పందించిన రీతూ
ధర్మ మహేశ్‌తో క్లోజ్‌గా ఉండేదని, అర్ధరాత్రి ఇంటికి వచ్చేదని, సీసీ కెమెరా వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ ఆరోపించింది. ఈ వివాదం కూడా రీతూపై కొంత నెగెటివిటీకి కారణమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్స్‌గా వచ్చిన ఫైర్ స్ట్రామ్ కంటెస్టెంట్లు డిమాన్ పవన్‌కు నాతో మాట్లాడొద్దని చెప్పేవారు.
ఓటేయమని ఫోన్ చేస్తే..
రీతూ బ్యాడ్.. నీకర్థం కావట్లేదు, ఆమె నిన్ను వాడుకుంటుంది అన్న టైపులో మాట్లాడేవారు. అదంతా చూసి అమ్మ చాలా బాధపడింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా అందర్నీ చూసి చాలా బాధగా అనిపించేది. ఇతర కంటెస్టెంట్లకు చుట్టాలందరూ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు కదా.. మాకెవరూ చేయరు, అలా మాకెవరూ లేరు కూడా! పాపం మా అమ్మ.. నాకు ఓటు వేయండి అని ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా.. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంటున్నారు, మేము ఓటు వేయం అన్నారు.
నన్ను నాశనం చేయాలని చూస్తే..
నాపై లేనిపోని నిందలు, ఆరోపణలు చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మమ్మీ.. అవన్నీ లైట్ అని సర్దిచెప్పి వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని. నా ఏడుపుకు కారణమైన వారికి ఏదో ఒకటి అవకుండా లేదు. నన్ను నాశనం చేయాలని చూస్తే కర్మ అనుభవిస్తారు. శివుడు నా ఎదుట ప్రత్యక్షమైతే మా మమ్మీ, అన్నయ్య కంటే ముందు నన్ను తీసుకెళ్లమని చెప్తాను అంటూ రీతూ భావోద్వేగానికి లోనైంది.


