ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బాలీవుడ్‌లో అనేక సక్సెస్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.
చిన్నతనంలోనే..
చిన్నప్పుడు మహారాజు గెటప్ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
సినిమా
తక్కువకాలంలోనే స్టార్ హీరోయి్‌గా మారింది. 1942: ఎ లవ్‌స్టోరీ, అకేలే, హమ్ అకేలే తుమ్, ఖామోషి: ద మ్యూజికల్, దిల్‌సే, కంపెనీ, తాజ్ మహల్, భూత్ రిటర్న్స్ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్ (భారతీయుడు), ముదల్వన్ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్ మూవీ చేసింది.
క్యాన్సర్‌పై పోరాటం
మనీషా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్‌ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్‌లో మల్లికాజాన్ అనే వేశ్యపాత్రలో యాక్ట్ చేసింది. గతేడాది లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది.


