కల్యాణ్‌ పడాల విజయంలో 'లేడీ క్వీన్‌' | Kalyan Padala Says Reason Behind Victory In Bigg Boss 9 Telugu | Sakshi
Sakshi News home page

కల్యాణ్‌ పడాల విజయంలో 'లేడీ క్వీన్‌'

Dec 22 2025 10:33 AM | Updated on Dec 22 2025 10:45 AM

Kalyan Padala Bigg Boss 9 Telugu Winning Behind Thanuja

బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫైనల్‌లో తనూజ, కల్యాణ్‌లు చరిత్ర తిరగ రాశారు. ఫైనల్‌ వరకు చేరుకున్న వారిద్దరూ హౌస్‌లో మంచి బాండింగ్‌తో ఉంటూనే రేసులో ఉన్నారు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్‌ విజేతగా నిలవడం గొప్ప విషయమేనని చెప్పాలి. సీజన్‌-7లో కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్‌లు కూడా ఇలాంటి బాండింగ్‌నే కొనసాగించారు. పల్లవి ప్రశాంత్‌ విజయంలో శివాజీ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే.. అయితే, కల్యాణ్‌ గెలుపులో తనూజ పాత్ర కూడా అంతే రేంజ్‌లో ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పాయింట్‌ను కల్యాణ్‌ కూడా స్టేజీపైనే ఒప్పుకున్నాడు. 

తన గెలుపులో ఆత్మవిశ్వాసం నింపిన వారిలో ఫస్ట్  ప్రియ, సెకండ్ శ్రీజ ఉంటారని చెబుతూ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేడీ క్వీన్ తనూజకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్‌ ఇలా చెప్పాడు. ' ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా ఒకానొక సందర్భంలో కల్యాణ్‌ గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనూజానే.. నేను ఒప్పుకుంటా అది.." అంటూ  క్లారిటీ ఇచ్చాడు.

బిగ్‌బాస్‌ రివ్యూవర్లు కూడా చాలామంది ఇదే మాట చెప్పడం విశేషం. బిగ్‌బాస్‌ సీజన్‌-7లో కూడా ఇలాంటి మ్యాజిక్‌నే జరిగింది. పల్లవి ప్రశాంత్‌ కోసం శివాజీ చాలా బలంగా నిలిచారు. తను 2వ రన్నర్‌గా నిలిచినప్పటికీ  ఎలాంటి బాధను చూపలేదు. హౌస్‌లో ప్రతిచోట పల్లవి ప్రశాంత్‌ కోసం స్టాండ్‌ తీసుకుంటూ తన గెలుపు కోసం రోడ్‌ క్లియర్‌ చేశారు. ఫైనల్‌గా అమర్‌దీప్‌కు ట్రోఫీ అందుతుందని అందరూ అనుకుంటే శివాజీ గేమ్‌ స్ట్రాటజీ వల్ల ప్రశాంత్‌  సులువుగా విన్నర్‌ అయిపోయాడు. 

అయితే,  ఈ సీజన్‌లో కూడా తనూజ వరుసగా పదివారాల పాటు టాప్‌లో ఉంది. 11వ వారం నుంచి ఒక్కసారిగా కల్యాణ్‌ రేసులోకి వచ్చేశాడు. అందుకు కారణం తనూజానే అని తను కూడా పలుమార్లు చెప్పాడు. తన గెలుపు కోసం తనూజ ఇచ్చిన సలహాలు చాలా వున్నాయని కల్యాణ్‌ ఒప్పుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement