
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) బంధాల షోగా మారిపోయింది. మీరంతా రిలేషన్స్ పెట్టుకోవడానికి హౌస్‌కి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చారని నాగ్ చురకలంటించినా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. గతవారం తనూజ ఫేవరెట్ వస్తువులను భరణితో.. భరణికి ముఖ్యమైన వస్తువులను తనూజతో పగలగొట్టించి.. ఈ రిలేషన్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టమని డైరెక్ట్‌గా చెప్పారు. అబ్బే, తలకెక్కితే కదా!
కనుక్కోండి చూద్దాం
ఈ బంధాల మధ్యలో ఎక్కువ నలిగిపోతుంది భరణియే (Bharani Shankar)! దానివల్ల ఇప్పుడేకంగా కెప్టెన్సీ కూడా చేజారింది. సేఫ్ జోన్‌లో ఉన్న ఇమ్మాన్యుయేల్, రాము, భరణి, దివ్య, పవన్ కల్యాణ్, తనూజ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. వీళ్లందరి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. తమ తలపై ఉన్న బల్బును ఎవరు ఆఫ్ చేశారో కరెక్ట్‌గా చెప్తే వాళ్లు ఎలిమినేట్!
కెప్టెన్‌గా కల్యాణ్
అలా దివ్య మొదటగా రామును తీసేసింది. కల్యాణ్ వంతు వచ్చేసరికి.. భరణి పేరు గెస్ చేశాడు. ఆయన తనూజ, దివ్యను ఎలాగో తీయడు. ఇమ్మాన్యుయేల్‌పై కొంత అనుబంధం ఉంది. కాబట్టి నన్ను తీసేయాలనుకున్నాడు అని కరెక్ట్‌గా గెస్ చేశాడు. అలా ఈ కనుక్కోండి చూద్దాం ఆటలో గెలిచి పవన్ కల్యాణ్ ఐదో కెప్టెన్‌గా నిలిచాడు.
చదవండి: కమల్ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ