సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో నిర్వహించాలని కోరిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరిచింది. నివాసంలో కేసీఆర్‌ను విచారించనుంది.
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


