హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌కు సోమవారం(జనవరి 26వ తేదీ) నోటీసుల ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సీఆర్సీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్‌రావు స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్‌రావు.
కాగా, ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నాయకులు కుల సమీకరణల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారని సిట్ ఆరోపిస్తోంది. 2017లో పి.రాధాకిషన్‌రావును బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండుసార్లు ఓఎస్డీగా అవకాశం ఇచ్చిందనేది సిట్ వాదన. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్‌ఎస్ నేతలు ఇలా చేశారని సిట్ చెబుతోంది.


