హైదరాబాద్: నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెండు రోజుల క్రితం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి చూపించిన తెగువను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. నేటి సమాజంలో ఈ తరహా మనుషులతో మానవత్వం ఇంకా చనిపోలేదనే విషయం అర్థమవుతుందని సజ్జనార్ కొనియాడారు.. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు సజ్జనార్
‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?' అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుంది. ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క బాధితుల ఆర్తనాదాలు.. అయినా దినేష్ వెనకడుగు వేయలేదు.
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి దినేష్ చేసిన సాయం నిజంగా సాహసోపేతం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దినేష్‌ను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉంది.
ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న మహమాద్ జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జఫర్ ఖాన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కేవలం దినేష్ మాత్రమే కాదు.. ఆపద సమయంలో మతసామరస్యం వెల్లువిరిసింది. అందరూ భుజం భుజం కలిపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కష్టం వస్తే 'మేమంతా ఒక్కటే' అని నిరూపించి, హైదరాబాద్ గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని మరోసారి చాటిచెప్పారు. వారందరికీ సెల్యూట్!!
‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?' అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుంది.
ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క… pic.twitter.com/MMNt5HjERv— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 26, 2026


