కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన కరీంనగర్ బైపాస్ రోడ్డలో చోటు చేసుకంది. స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. స్కూల్ బస్సు ముందు వెళుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ మృతి చెందారు.
ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అందులో ఒకర గణేష్ అనే యువకుడు కాగా, మరొకరు సందీప్‌రెడ్డి అనే మరో యువకుడిగా నిర్దారించారు.


