సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావును సిట్ ప్రశ్నిస్తోంది. ఐదు గంటలుగా హరీష్‌ను విచారిస్తున్నారు. హరీష్ రావు ఆరోగ్యం పై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ విచారణకు న్యాయవాదులను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు విచారణ వీడియో విడుదల చేయాలని కోరారు. డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. హరీష్‌ను ప్రశ్నిస్తోంది. తనకు క్లియరెన్స్ ఇస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీల ఉత్తర్వులను సిట్‌కు హరీష్‌రావు అందజేశారు.


