ప్రేమ విఫలమై ఇద్దరు యువకుల ఆత్మహత్య | Two young men dead love failure | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై ఇద్దరు యువకుల ఆత్మహత్య

Mar 11 2026 12:54 AM | Updated on Mar 11 2026 12:54 AM

Two young men dead love failure

శశికుమార్‌ , అనిల్‌

నర్మెట/కురవి: ప్రేమ విఫలమై ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రెండు వేర్వేరు చోట్ల జరిగాయి. జనగామ జిల్లా నర్మెట మండలం ఇప్పలగడ్డ గ్రామానికి చెందిన ఇట్టబోయిన అనిల్‌ (20) ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఓ యువతిని ప్రేమించగా తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురైన అనిల్‌ మంగళవారం ఉదయం 4 గంటలకు వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి పురుగులమందు తాగి చనిపోయాడు. మరో ఘటనలో ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. కురవికి చెందిన వల్లపునేని కవిత–రమే శ్‌ కుమారుడు శశికుమార్‌ (20) ఇంటర్‌ పూర్తిచేసి వివిధ పనులు చేస్తూ కురవిలోని బాబా యి, పిన్ని ఇంట్లో ఉంటున్నాడు. చదువుకునే సమయంలోనే జిల్లాకు చెందిన ఓ ఇంటర్‌ వి ద్యార్థినిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. 

మంగళవారం ఆ విద్యార్థిని ఇంటర్‌ సెకండియర్‌ పరీక్ష రాసేందుకు మహబూబాబాద్‌కు వచ్చింది. పరీక్ష ముగిసిన తర్వాత మళ్లీ ఆమె కలవదేమోనని శశికుమార్‌ మనస్తాపానికి గురయ్యాడు. పిన్ని, బాబాయి ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Advertisement
 
Advertisement
Advertisement