కాచిగూడ (హైదరాబాద్): రైళ్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కాచిగూడ–కర్నూల్ సిటీ (17435), 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కర్నూల్ సిటీ – కాచిగూడ (17436) రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం) సంతోష్ కుమార్ వర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
11 నుంచి 31 వరకు కాచిగూడ – రాయచూర్ –కాచిగూడ వయా దేవరకద్ర, కృష్ణా (67787, 67788), కాచిగూడ– రాయచూర్–కాచిగూడ వయా గద్వాల్ (17693, 17694) రైళ్లను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. గద్వాల్ –రాయచూర్–గద్వాల్ (67784, 67783)ను రద్దు చేస్తున్నామని వివరించారు.


