రైల్వేకు వందల కోట్ల లాభం | Railways earns hundreds of crores by selling scrap | Sakshi
Sakshi News home page

రైల్వేకు వందల కోట్ల లాభం

Mar 10 2026 8:26 PM | Updated on Mar 10 2026 9:39 PM

Railways earns hundreds of crores by selling scrap

'తుక్కు' సాధారణంగా ఈ పదం ఎందుకు పనికి రాకుండా వృథాగా ఉన్న వస్తువుల విషయంలో వాడుతుంటాం.. అయితే అదే కోట్ల వర్షం కురిపిస్తే.. తుక్కేంటి..కోట్లేంటి అనుకుంటున్నారా.. లేదండి ఇది అక్షరాల నిజం దక్షిణ మధ్య రైల్వే గతేడాదికి సంబంధించిన స్క్రాప్‌ను అమ్మితే వందల కోట్లు సంస్థకు వచ్చాయి.

దక్షిణ మధ్య రైల్వే (SCR) “మిషన్ జీరో స్క్రాప్” అనే కార్యక్రమంలో స్క్రాప్‌ను విక్రయిస్తుంది. ఈ కార్యక్రమం ప్రకారం ఒక నెలకు మించి స్క్రాప్ (పాత లోహ వస్తువులు) నిల్వ ఉండకుండా వెంటనే విక్రయించాలని నియమం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు రూ. 510.00 కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే రికార్డు స్థాయిలో   లక్ష్యాన్ని అధిగమించి, ₹602.06 కోట్ల ఆదాయం స్క్రాప్ విక్రయాల ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఆదాయం పొందింది.

మొత్తంగా  132,583 మెట్రిక్ టన్నుల స్క్రాప్ ను సేకరించి, దేశం నలుమూలల నుంచి వచ్చిన కొనుగోలుదారులకు e-Auction ద్వారా పూర్తిగా పారదర్శకంగా విక్రయించింది. దీని వల్ల స్వచ్ఛ భారత్ మిషన్‌కు సహకారం అందడంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాంగణాలు శుభ్రంగా మరియు పచ్చగా మారాయి. అంతే కాకుంజా అలాగే ఇప్పటివరకు భారతీయ రైల్వేలలో  స్క్రాప్ విక్రయాల ద్వారా అధిక ఆదాయం పొందిన  మెుదటి రైల్వేజోన్‌గా రికార్డు సాధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement